JGL: జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా డ్రగ్స్ స్టోర్‌ను డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎన్. శ్రీనివాస్ సోమవారం తనిఖీ చేశారు. ఎక్స్‌రే యంత్రాలు, మందుల నిల్వలు, ఇతర వైద్య పరికరాలను పరిశీలించారు. నిల్వల నిర్వహణ, పరికరాల భద్రతపై అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ స్టోర్స్‌మన్ శ్రీనివాస్, ఫార్మసిస్టులు గిరిధర్, జంషీద్ ఉన్నారు.
తెలంగాణ
జిల్లా డ్రగ్స్ స్టోర్‌ను తనిఖీ చేసిన DHMO


