ATP: గుంతకల్లు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజు సోమవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి మూలమూర్తికి బంగారు, వెండి ఆభరణాలతో భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అన్నపూర్ణ దేవిగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
అన్నపూర్ణ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం


