NLR: ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు సీతారామపురం మండలంలోని బసినేపల్లి, సింగారెడ్డిపల్లి, సీతారామపురం ప్రాంతాల్లో సోమవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజల్లో భద్రత భావం కల్పించేందుకు కవాతు చేపట్టినట్లు ఉదయగిరి సీఐ అంకమ్మరావు తెలియజేశారు. ప్రజలు పోలీసులకు సహకరించి, శాంతియుత వాతావరణాన్ని కాపాడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సీతారామపురంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్


