NLG: నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 36వ అఖిల భారత కిసాన్ మహాసభలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్ష మంది రైతులతో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి జరిగే ఈ మహాసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
'అఖిల భారత కిసాన్ మహాసభలను విజయవంతం చేయాలి'


