హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ

MDK: విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయుధ పూజ వేడుకగా జరిగింది. ఆయుధాలతో పాటు వాహనాలకు ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి చెట్టు వద్ద పూజలు చేసి, సిబ్బందికి జమ్మి పత్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని ఎస్పీ సూచించారు.