హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో సీపీఎం పార్టీ పోటీ

ASR: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బాక్సైట్ తవ్వకాలు, హైడ్రోపవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా సీపీఎం పోటీ చేస్తుందని జిల్లా కార్యదర్శి అప్పలనర్స సోమవారం తెలిపారు. తొలి విడతలో 5 మండలాల జడ్పీటీసీ అభ్యర్థులతో పాటు 110 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తామని, 48 మంది అభ్యర్థుల జాబితాను ఆమోదించామని వెల్లడించారు. గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేస్తామన్నారు.