హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే కాలవ

ATP: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. డి.హీరేహల్ మండలం సోమలాపురం గ్రామ పరిధిలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు.