హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్తీ దవాఖానాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన

MDCL: జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM), NUHM పథకాల కింద పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు DMHO డా. కె. ఆనంద్ తెలిపారు. బస్తీ దవాఖానాలు, మినీ హబ్‌లలో 16 కేటగిరీలకు చెందిన మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ANMలు, సహాయక సిబ్బంది పోస్టులను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.