GDWL: జిల్లాకేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో వీధి కుక్కల బెడదతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నపిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బెడదను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
కాలనీలో కుక్కల బెడద.. ప్రజల్లో ఆందోళన!


