హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

NZB: నవీపేట్ మండలం మిట్టాపూర్‌కు చెందిన తెడ్డు గణేశ్(39) పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మద్యానికి బానిసైన గణేశ్ భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఈనెల 17న మద్యం మత్తులో పురుగు మందు తాగినట్లు భార్యకు తెలిపాడు. వెంటనే నిజామాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.