హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరిపిరాలలో ఘనంగా దుర్గమ్మ నవరాత్రి అన్నదానం..!

MHBD: హరిపిరాల గ్రామంలో డ్రీమ్స్ యూత్ హరిపిరాల ఆధ్వర్యంలో అక్టోబర్ 19న దుర్గమ్మ నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ వద్ద భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.