హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేత్రదాన కుటుంబ సభ్యులకు అభినందన

PDPL: కమాన్ పూర్ మండలం మియాపూర్ గ్రామానికి చెందిన గాండ్ల అంజమ్మ(92) ఇటీవల మరణించగా, కుటుంబ సభ్యులు ఆమె నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. సోమవారం ఆమె నివాసంలో సంస్మరణ సభ నిర్వహించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు హాజరై అంజమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. నేత్రదానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి ఆదర్శంగా నిలిచిన కుటుంబ సభ్యులకు అభినందన పత్రం, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.