సత్యసాయి: విజయదశమి సందర్భంగా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఆయన సతీమణి ధరణ్య సోమవారం పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు. తొలుత దుర్గాదేవికి, అనంతరం పోలీసు ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రజలు, మీడియా ప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆయుధ పూజ నిర్వహించిన ఎస్పీ సతీష్


