హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కార్మికుల హక్కుల కోసం ఐక్య పోరాటం చేయాలి'

SRPT: తెలంగాణ గీత పనివారల సంఘం 70వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవన్ ఎదుట సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రేగటి లింగయ్య జెండాను ఆవిష్కరించారు. సంఘం వ్యవస్థాపకుడు బొమ్మగాని ధర్మభిక్షం ఆశయాలను కొనసాగిస్తూ గీత కార్మికుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు.