హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దరఖాస్తులు పెండింగ్ పెడితే చర్యలు తప్పవు'

ADB: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు.