WNP: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన 25 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను చైర్పర్సన్ జి. నాగమణి, వైస్ చైర్మన్ ఎం. శ్రీనివాసులు, కమిషనర్ ఎ. నరేష్ కుమార్ పంపిణీ చేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని వారు తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
25 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు


