హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా.. ఇలా చేస్తే జైలుకే

SDPT: పాలపిట్టను పట్టుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిద్దిపేట జిల్లా అటవీ శాఖ అధికారిణి పద్మజ రాణి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పాలపిట్టను పట్టుకోవడం, విక్రయించడం, బంధించడం చట్ట రీత్యా నేరమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.