హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంద్రానగర్ ఎంపీటీసీ టికెట్ కోసం విజ్ఞప్తి

TPT: వరదయ్యపాలెం మండలం ఇంద్రానగర్ ఎంపీటీసీ టికెట్‌ను కేటాయించాలని టీడీపీ సీనియర్ నాయకురాలు కె. లక్ష్మి పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. గత 30 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న తనకు ఈసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో రెండుసార్లు పార్టీ నిర్ణయానికి కట్టుబడి పోటీ నుంచి తప్పుకున్నానని, ప్రస్తుతం మహిళా జనరల్ స్థానం కావడంతో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.