హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేణికుంట గ్రామంలో శరన్నవరాత్రి సందర్భంగా చండీ హోమం

BHNR: రాజాపేట మండలంలోని రేణికుంట గ్రామంలో భవాని సేన ఆధ్వర్యంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారి సన్నిధిలో వేద పండితులు చలివేదుల రాజేశ్వర్ శర్మ నేతృత్వంలో వైభవంగా చండీ హోమం నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు దంపతులు, భవాని సేన కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.