హైదరాబాద్: 28°C
తెలంగాణ

వడ్డీ వ్యాపారులపై పోలీసుల మెరుపు దాడులు

NZB: జిల్లా కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతంగల్ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు ఉమ్మడిగా మెరుపు దాడులు నిర్వహించారు. ఎలాంటి లైసెన్సులు, సరైన పత్రాలు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న రూ.74.50 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన పలువురు వ్యాపారులపై కేసులు నమోదు చేసారు.