హైదరాబాద్: 28°C
తెలంగాణ

టన్నెల్, రాజీవ్ లింక్ కెనాల్ పనులను పరిశీలించిన మంత్రి

KMM: వైరా నియోజకవర్గ పరిధిలోని జులూరుపాడు టన్నెల్, రాజీవ్ లింక్ కెనాల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో కలిసి పరిశీలించారు. సాగు, తాగునీటి ఎద్దడి రాకుండా ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాసు నాయక్, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.