హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామీణ రహదారులకు రూ.174.32 కోట్ల నిధులు

SRPT: సూర్యాపేట జిల్లాలోని కోదాడ,హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.174.325 కోట్లు మంజూరయ్యాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చొరవతో 13 మండలాల్లో 54 రహదారి పనులకు అనుమతులు లభించాయి. మొత్తం 156.95 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించనుండగా,కోదాడకు రూ.30 కోట్లు, హుజూర్‌నగర్‌కు రూ.144.325 కోట్లు కేటాయించారు.