హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైడ్రా వాహనాలకు కమిషనర్ పూజలు

HYD: విజయదశమి సందర్భంగా హైడ్రా పార్కింగ్ యార్డులో కమిషనర్ ఏవీ రంగనాథ్ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విధుల్లో కీలకమైన వాహనాలు, పరికరాలకు పూజలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలిపి, ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు.