హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి ఫరూక్‌ను కలిసిన ఎంపీ శబరి

NDL: నంద్యాల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, టీడీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి డాక్టర్ బాబన్‌ను ఎంపీ బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇరువురు నేతలు తాజా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. టీడీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి బాబన్‌కు ఎంపీ శబరి శుభాకాంక్షలు తెలిపారు.