అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టేందుకు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 9 ప్రధాన చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు. పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో 24 గంటల పాటు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగదు, విలువైన వస్తువులు తీసుకెళ్లే వారు సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలని, నిబంధనల పాటించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాలో 9 చెక్ పోస్టులు ఏర్పాటు'


