హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గాదేవి నిమర్జన ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

ADB: ఆదిలాబాద్‌లో దుర్గాదేవి నిమర్జన ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు 9 సెక్టార్లుగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. షీ టీమ్స్‌తో నిఘా ఉంచామని, అత్యవసర వేళల్లో మహిళలు డయల్ 100 ద్వారా పోలీసులను సంప్రదించాలని కోరారు.