హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

21న జమ్మివేట మహోత్సవం

VSP: విజయదశమి సందర్భంగా ఈ నెల 21న సింహాచలం కొండ దిగువ పూదోట ప్రాంగణంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి జమ్మివేట మహోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. స్వామివారు అమ్మవారితో కలిసి అశ్వవాహనంపై తిరువీధి ఉత్సవంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు.