హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అభివృద్ధికి నిధులు కేటాయించాలి'

MBNR: బాలానగర్ మండలం నేరళ్లపల్లి గ్రామ అభివృద్ధికి హెచ్ఎండీఏ నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హెచ్ఎండీఏ నిధులతో గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయన్నారు.