హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసనలో బతుకమ్మ

WNP: జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె ఏడో రోజుకు చేరింది. జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా శిబిరంలో నిరసన బతుకమ్మ ఆడి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.