హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

RR: చేవెళ్ల మండలం తంగడపల్లి–హుసేనపూర్ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.