హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల పేర్ల పరిశీలన

ASR: అనంతగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మజ్జి అప్పలరాజు ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. అరకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ శెట్టి గంగాధర్ స్వామి హాజరై, రానున్న స్థానిక ఎన్నికల్లో ZPTC, MPTC అభ్యర్థుల పేర్లను పరిశీలించారు. పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నద్ధత, సమర్థవంతమైన నాయకుల ఎంపికపై చర్చించి, కార్యకర్తల సమన్వయంతో విజయానికి కృషి చేయాలని అన్నారు.