హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడ్చల్ ప్రజావాణిలో 23 దరఖాస్తులు

MDCL: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 23 దరఖాస్తులు అందాయి. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి మాలతి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.