KRNL: దసరా పండుగ నేపథ్యంలో ఆదోని పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరమైంది. వివిధ గ్రామాల నుంచి ప్రజలు పండుగ సామగ్రి కొనుగోళ్లకు రావడంతో ప్రధాన రహదారులు రద్దీగా మారాయి. వాహనాలను ఇష్టానుసారంగా నిలపడంతో గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
దసరా కొనుగోళ్లతో ఆదోనిలో ట్రాఫిక్ కష్టాలు


