హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీఆర్డీఓ కేంద్రంలో మాక్ డ్రిల్

MDCL: కీసరలోని DRDO కేంద్రంలో మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు కేంద్రం ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్ జాగిలం సాయంతో అనుమానాస్పద ప్రాంతాలను తనిఖీ చేశారు. అవాంఛనీయ ఘటనలను నివారించేందుకు భద్రతా చర్యల సంసిద్ధతను పరీక్షించారు.