MDCL: తార్నాకలోని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మహానవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాదేవికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఎంఎంసీ కమిషనర్‌తో పాటు ఎల్బీనగర్, మల్కాజిగిరి జోనల్ కమిషనర్లు అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని అధికారులు ఆకాంక్షించారు.
తెలంగాణ
కార్పొరేషన్‌లో ఘనంగా దుర్గాదేవి పూజలు


