హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటరు నమోదును వేగవంతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే

KMM: ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిలుపునిచ్చారు. పెనుబల్లిలో బీఆర్‌ఎస్ శ్రేణులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన పట్టభద్రులందరితో పెద్ద సంఖ్యలో కొత్త ఓట్లు నమోదు చేయించాలని దిశానిర్దేశం చేశారు.