హైదరాబాద్: 28°C
వ్యాపారం

అమెజాన్‌లో మరోసారి ఉద్యోగులపై వేటు!

ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. న్యూయార్క్‌లో దాదాపు 5వేల మంది డెలివరీ విభాగంలో ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. అలాగే, 15 గిడ్డంగులను మూసివేయనున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీంతో న్యూయార్క్ నగరంలో డెలివరీ సమయాలు, ధరలు పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.