హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిక

NLG: కట్టంగూరు మండలం దిగినవెల్లి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకున్నారు. మన్యం ఆగమయ్య, కులకరం కోటయ్య, వనం వెంకన్న, వనం మల్లయ్య తదితరులతో పాటు పలువురు మహిళలు కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఉన్నారు.