హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీజీపీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి... కలెక్టర్

NZB: ఈ నెల 24, 26 తేదీల్లో టీజీపీఎస్సీ నిర్వహించనున్న సీబీటీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ పోస్టుల భర్తీకి పరీక్షలు జరగనున్నాయి. ఏర్పాట్లపై టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.