SRD: జిల్లా కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు ఆశన్న గౌడ్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం పోతేపల్లి వద్ద జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. గీత కార్మికుల సొసైటీకి ఐదు ఎకరాల భూమి కేటాయించాలని, కార్మికులకు నెలకు రూ.4 వేల పెన్షన్ అందించాలని కోరారు.
తెలంగాణ
'గీత కార్మికులకు హామీలు అమలు చేయాలి'


