హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవి నవరాత్రి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

SRD:​ కంది మండల కేంద్రంలో ప్రతిష్టించిన దుర్గా భవానీ అమ్మవారిని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికి, శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.