హైదరాబాద్: 28°C
క్రీడలు

సాక్షిని సరదాగా ఆటపట్టించిన ధోనీ

జామ్ నగర్‌లో(గుజరాత్) అనంత్ అంబానీ నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో మహేంద్ర సింగ్ ధోనీ కుటుంబంతో కలిసి సందడి చేశాడు. అనంత్, రాధికతో కలిసి కార్నివాల్ రైడ్స్‌ను ఆస్వాదించిన ధోనీ.. ఐస్క్రీమ్ తింటూ భార్య సాక్షిని సరదాగా ఆటపట్టించాడు. ఎగ్జిబిషన్‌లో కుర్రాడిలా ఎంజాయ్ చేసిన ధోనీకి సంబంధించిన సరదా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.