హైదరాబాద్: 28°C
తెలంగాణ

తలకొండపల్లి–కడ్తాల్ రోడ్డు విస్తరణ షురూ

RR: తలకొండపల్లి–కడ్తాల్ మధ్య రోడ్డు విస్తరణ పనులకు టెండర్లు పూర్తయ్యాయని ఆర్‌అండ్‌బీ ఏఈ సాయికుమార్ తెలిపారు. అటవీ ప్రాంతంలో 1.5 కి.మీ., తలకొండపల్లి చౌరస్తా నుంచి కర్వెన్ తండా సమీపం వరకు 4.5 కి.మీ. మేర రోడ్డు విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పనులను మొత్తం రూ.17.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.