హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూపాలపల్లి ఆర్టీసీ డిపోకు రాష్ట్రంలో అగ్ర స్థానం

BHPL: సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగల సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపిన భూపాలపల్లి ఆర్టీసీ డిపో రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఈపీకే లో రూ.74.70 ఆదాయంతో మొదటి స్థానం సాధించింది. మొత్తం 90 బస్సులున్న ఈడిపో ఈ నెల 9 నుంచి 17 వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సేవలందించింది. ఎనిమిది రోజుల్లో సుమారు రూ.30 లక్షల ఆదాయం సమకూరింది.