హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాకంబరీ మాతను దర్శించుకున్న MP గోడం నగేశ్

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని 49వ వార్డులో గల శాకంబరీ మాతను MP గోడం నగేశ్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరూ దేవీ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని MP నగేశ్ పిలుపునిచ్చారు. వార్డు కౌన్సిలర్ ప్రకాష్, బీజేపీ నాయకులు ఉన్నారు.