హైదరాబాద్: 28°C
వార్తలు

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 8,436 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 539.80 అడుగులు, నీటి నిల్వ 187.91 టీఎంసీలుగా ఉంది. వివిధ అవసరాలకు నీటిని విడుదల చేస్తుండగా, మొత్తం ఔట్‌ ఫ్లో 13,244 క్యూసెక్కులుగా నమోదైంది.