AP: రాష్ట్రంలో పట్టణ సంస్థల ఎన్నికలకు రికార్డు స్థాయిలో 22,800కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రతి పార్టీ, వర్గం, నలుమూలల నుంచి అభ్యర్థులు ఎన్నికల కోసం ముందుకొచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉందని చెప్పుకొచ్చారు. ఒక్క ఓటు కూడా పడకముందే అక్రమాలు జరిగాయని, ప్రజలే ఫలితాలను నిర్ణయిస్తారన్నారు. ఈ మేరకు 'X'లో లోకేష్ పోస్టు పెట్టారు.
వార్తలు
ఏపీలో ప్రజాస్వామ్యం సజీవం: మంత్రి లోకేష్


