ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రాంపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం పర్యటించారు. గ్రామంలోని దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామానికి వచ్చిన కలెక్టర్ కు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. నవరాత్రి ఉత్సవాలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.
తెలంగాణ
దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా


