KNR: కరీంనగర్ కొత్త కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదుదారులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రజల రాక తగ్గింది. సగానికి పైగా జిల్లా అధికారులు కూడా గైర్హాజరయ్యారు. దీంతో రిజిస్ట్రేషన్ విభాగంలో సిబ్బంది ఖాళీగా కనిపించారు. ఇతర అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదుల సేకరించారు.
తెలంగాణ
VIDEO: కరీంనగర్ కలెక్టరేట్‌లో ప్రజావాణికి తగ్గిన ఫిర్యాదులు


