హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బీజేపీ సీనియర్ నేత ఓటు గల్లంతు

NTR: నందిగామ పట్టణంలో బీజేపీ సీనియర్ నాయకులు షేక్ సైదా ఓటరు జాబితాలో తన ఓటు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ స్వతంత్ర ఛైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన సమయంలో ఎన్నికల అధికారి ఓటర్ జాబితాలో తన పేరు లేదని చెప్పారు. 1984 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, నా ఓటు హక్కు గల్లంతవ్వటానికి కారణమేంటని ఆయన మండిపడ్డారు.